Allu Arjun vs Virat Kohli : సినీ సెలబ్రిటీలు జనాల్లోకి వచ్చినప్పుడు అప్పుడప్పుడు తొక్కిసిలాట ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ప్రభుత్వం అందుకు తగ్గ సెక్యూరిటీ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. సెక్యూరిటీ విఫలం అయ్యినప్పుడు అమాయకుల ప్రాణాలు పోతూ ఉంటాయి. నిన్న బెంగళూరు లో జరిగిన ఘటన అలాంటిదే. వివరాల్లోకి వెళ్తే RCB టీం IPL ట్రోఫీ ని గెలిచిన తర్వాత టీం మొత్తం కలిసి బెంగళూరు కి వచ్చారు. టీం మొత్తానికి ఘనస్వాగతం పలికేందుకు వేలాది మంది అభిమానులు వచ్చారు. బెంగళూరు చిన్న స్వామి స్టేడియం ప్రాంగణం మొత్తం ఎటు చూసినా జనాలతో నిండిపోయింది. ఇసుకేస్తే రాలనంత జనం. అంత జనం ఉన్నప్పుడు దానికి తగ్గట్టు సెక్యూరిటీ ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ ప్రభుత్వం ఆ విషయం లో విఫలమైంది. ఫలితంగా తొక్కిసిలాట ఘటన జరిగి 11 ప్రాణాలు పోయాయి. ఎంతోమంది గాయపడ్డారు.
దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి క్షమాపణలు కూడా చెప్పుకొచ్చారు. ఇక ప్రతిపక్షాలు అయితే తీవ్రమైన విమర్శలు చేశాయి. జట్టు ట్రోఫీ తో తిరిగి వస్తున్నప్పుడు అసంఖ్యాకమైన జనాలు హాజరు అవుతారనే విషయం తెలియదా?, తెలిసి కూడా ఎందుకు ఇలా చేసారు?, ఇది కచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యమే అంటూ మీడియా ముఖంగా ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడ్డారు. గత ఏడాది హైదరాబాద్ సంధ్య థియేటర్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ‘పుష్ప 2’ ప్రీమియర్ షోకి అల్లు అర్జున్(Icon Star Allu Arjun) థియేటర్ కి రాగా ఆయన్ని చూసేందుకు వేలాది మంది అభిమానులు ఎగబడడం తో తొక్కిసిలాట ఘటన జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ నిన్న మొన్నటి వరకు హాస్పిటల్ లో ఉన్నాడు. అయితే కర్ణాటక లో జరిగిన తొక్కిసిలాట ఘటన లో ప్రభుత్వానిదే వైఫల్యం అనేది బాగా హైలైట్ అయ్యింది కానీ, సంధ్య థియేటర్ ఘటన విషయంలో మాత్రం అల్లు అర్జున్ నే అందరు తప్పుబట్టారు.
ఆరోజు జరిగిన ఘటనలో అల్లు అర్జున్ వైపు, అదే విధంగా ప్రభుత్వం వైపు సరిసమానమైన పొరపాట్లు ఉన్నాయి. కానీ తప్పు మొత్తం అల్లు అర్జున్ వైపుకు నెట్టి ఆయన్ని అరెస్ట్ కూడా చేయించారు. అప్పుడు అలా చేసారు కదా, ఇప్పుడు కూడా విరాట్ కోహ్లీ(Virat Kohli) ని అరెస్ట్ చేసి తప్పు మొత్తం ఆయన వైపుకు నెట్టేస్తారా?, కాంగ్రెస్ పార్టీ కి ఇది బాగా అలవాటైన పనే కదా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. దీనికి ప్రభుత్వం వైపు నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. మరో వైపు విరాట్ కోహ్లీ, అల్లు అర్జున్ దురదృష్ట జాతకులు అని, వీళ్ళు సాధించిన విజయాలను మనస్ఫూర్తిగా ఆస్వాదించే అవకాశం కూడా లేకపోయిందని అంటున్నారు నెటిజెన్స్.