
ప్రైవేటు ఆస్పత్రులకు కేటాయించిన టీకా కోటాను తిరిగి రాష్ట్రానికే కేటాయించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సీఎం జగన్ కొవిడ్ కట్టడిలో రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర విభజన కారణంగా వైద్య పరంగా మౌలిక సదుపాయాల కల్పన విషయంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నామని వివరించారు.