‘కత్రినా కైఫ్’ పేరులోనే మంచి కైపు ఉంది, తన పేరుకి తగ్గట్టుగానే తన అందచందాలతో కూడా ఎప్పటికప్పుడు కవ్విస్తూ ఉంటుంది ఈ ముదురు బ్యూటీ. అసలు కత్రినా వయసు పెరుగుతుందా..? లేక తగ్గుతుందా..? అన్న అనుమానాలు కూడా పెరుగుతున్నాయి నెటిజన్లకు. ముప్పై ఎనిమిది ఏళ్ల వయసులో కూడా ఇంకా తన అందంతో అదరహో అనిపిస్తుందంటే అది ‘కత్రినా’కి మాత్రమే సాధ్యమైన ప్రత్యేకత అనుకోవాలి.
ఎందుకంటే.. కత్రినాతో పాటు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళంతా ఎప్పుడో ఫేడ్ అవుట్ అయ్యారు, అలాగే షేప్ అవుట్ కూడా అయిపోయారు. కానీ కత్రినా మాత్రం మూడు పదుల వయసు దాటిపోయే స్టేజిలో కూడా ఇంకా కుర్రకారు కంటికి కునుకు లేకుండా చేస్తోంది. పైగా బాలీవుడ్ లో కత్రినా ఇంకా బిజీ హీరోయిన్ గానే కొనసాగుతుంది. ఆమె చేతినిండా నాలుగు సినిమాలు ఉన్నాయి.
కాగా నేడు ‘కత్రినా’ 38వ పుట్టిన రోజు. ప్రస్తుతం కత్రినాకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి తెగ పోటీ పడుతున్నారు ఫ్యాన్స్. అలాగే సినీ ప్రముఖులు కూడా కత్రినాకి తమదైన శైలిలో శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో సిద్ధాంత్ చతుర్వేది మెసేజ్ చేస్తూ.. ‘సిటీలోనే కూల్ గర్ల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మా బ్యాడ్ -మింటన్ గేమ్ నుండి మీతో సాగిన సుదీర్ఘ ఫిట్ నెస్ అండ్ హాక్ చాట్ ల వరకు చాల ఎంజాయ్ చేశాను.
నేను మీ నుండి నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ ఎదురుచూస్తున్నాను. మీ అభిమాని నుండి మీ సహ నటుడిగా ఎదిగాను. ఇప్పుడు నీకు స్నేహితుడ్ని. నువ్వు ఎల్లప్పుడూ చాలా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ పోస్ట్ చేశాడు. అలాగే మా కలల రాణి, ఏంజెల్, క్యూట్ బేబీ అంటూ నెటిజన్లు కూడా కత్రినాకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.