TDP Janasena BJP Alliance : వైసిపి ( YSR Congress party)ముఖ్య నేతలకు కూటమి మంత్రులు టచ్లోకి వెళ్లారా? ఇది నమ్మదగిన వార్త? అసలు దీనిని నమ్మవచ్చా? అంటే ముమ్మాటికీ నమ్మలేమనే సమాధానం వస్తుంది. ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతోంది. మూడు పార్టీల మధ్య పొత్తు సమన్వయం సజావుగా ఉంది. సంక్షేమంతో పాటు అభివృద్ధికి ఎనలేని ప్రాధాన్యమిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది. ప్రతి చోటా ఎన్డీఏ గెలుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి తెలుగుదేశం పార్టీ నమ్మదగిన మిత్రుడిగా మారింది. ఇన్ని సానుకూలతల మధ్య మంత్రులు వైసీపీ ముఖ్య నేతలకు టచ్ లోకి వెళ్లారా? లేకుంటే ఆ ముఖ్య నేతలే మంత్రులకు టచ్లోకి వెళ్లారా? ఇప్పుడు ఇదే అనుమానం అందరిలోనూ నెలకొంది. కచ్చితంగా ఇది వైసీపీ సోషల్ మీడియా పని అన్న అనుమానం ఉంది. ఇది ఎంత మాత్రం నమ్మదగిన వార్త కాదు అన్నది విశ్లేషకుల మాట.
* కేసులతో వెంటాడుతూ..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో దూకుడుగా వ్యవహరించిన నేతలను వెంటాడుతోంది కూటమి ప్రభుత్వం( Alliance government ) . అది కూడా ఒక పద్ధతి ప్రకారం. ఏవైనా కేసులు నమోదు చేసినప్పుడు.. అరెస్టులు జరిగినప్పుడు.. వారికి న్యాయపరంగా కొన్ని మినహాయింపులు ఇస్తోంది. న్యాయస్థానాలకు వెళ్లి ఉపశమనం పొందేలా అవకాశాలు కల్పిస్తోంది. కూటమి ప్రభుత్వానికి భయపడి రాష్ట్రంలో సగానికి పైగా నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు యాక్టివ్ గా లేరు. ఆపై కూటమికి అంతా సానుకూలంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ మద్దతు పుష్కలంగా ఉంది. ఇటువంటి సమయంలో కూటమి ప్రభుత్వం పై ప్రతికూలత.. వైసీపీ పై అనుకూలత ఉన్నట్టు ప్రచారం నడుస్తోంది. ఒక ప్రభుత్వ పరంగా కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండవచ్చు కానీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై సానుకూలత మాత్రం లేదు. అదే జరిగితే పొలిటికల్ జంక్షన్లో ఉన్న చాలామంది నేతలు తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరారు? చాలా మంది వైసీపీ ఎమ్మెల్సీలు ఏడాది కిందట పార్టీకి రాజీనామా చేశారు. వారి రాజీనామాలు ఆమోదానికి నోచుకోలేదు. కూటమి నుంచి మంత్రులు వైసీపీ నేతలకు టచ్ లోకి వెళ్తే.. ఆ ఎమ్మెల్యేలు తమ రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకొని తిరిగి పార్టీలోకి వెళ్లిపోవచ్చు కదా..
* అసలు ముఖ్యనేతలు ఏరి?
వైసిపి ముఖ్య నాయకులు ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy) చుట్టూ ఉండే నేతలంతా ఇప్పుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఒకరిద్దరూ జైల్లో ఉన్నారు. మరికొందరు కేసుల భయంతో గడుపుతున్నారు. అటువంటి వారిని క్యాబినెట్ మంత్రులు టచ్ లోకి వెళ్ళారా? ముందస్తు ఒప్పందాలు చేసుకున్నారా? అది ఎంతవరకు నమ్మదగిన వార్త? జగన్మోహన్ రెడ్డి పుట్టేడు కష్టాల్లో ఉన్నారు. ఆయనకు కేసులు వెంటాడుతున్నాయి. అవినీతి అక్రమ కేసులు ఎదురుగా ఉన్నాయి. ఆ పార్టీ నేతలు చాలా కేసుల్లో ఇరుక్కున్నారు. పరిస్థితి చూస్తే అగమ్య గోచరంగా ఉంది. కుటుంబం కూడా వ్యతిరేకంగా ఉంది. ఇటువంటి పరిస్థితులు తెలుసుకొని మంత్రులు వైసీపీ సీనియర్లకు టచ్ లోకి వెళ్లడం ఏంటి? ఎప్పుడో అధికారంలో వస్తుందనుకున్న వైసిపి కి.. ప్రస్తుతం అధికారం చలాయిస్తున్న మంత్రులు దాసోహం కావడం ఏంటి? ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి సామాన్యుడు సైతం ఆలోచించుకున్న ఇంటి అర్థం అయిపోతుంది. ఇది తప్పుడు వార్త అని తేలిపోతోంది.