
ఏపీలో శిశు మరణాలు తగ్గించడంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వైద్యారోగ్యో శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఫ్యామిలీ హెల్త్ డాక్టర్ కాన్సెప్ట్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజారోగ్యంపై నిరంతర పరిశీలన, పర్యవేక్షన ఉండాలన్నారు. విలేజ్ క్లినిక్స్ స్థాయిలోనూ పరీక్షలు అందుబాటులో ఉండాలని వెల్లడించారు. అవసరమైన చోట సీహెచ్ సీల్లోనూ డయాలసిస్ యూనిట్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.