https://oktelugu.com/

Aadhaar Card: మొబైల్ లో ఆధార్, పుట్టిన తేదీలను మార్చవచ్చు.. ఎలా అంటే..?

Aadhaar Card: మనలో చాలామంది ఆధార్ కార్డ్ లో పేరు, పుట్టినతేదీ వివరాలు తప్పుగా ఉండటం వల్ల ఇబ్బంది పడుతుంటారు. యూఐడీఏఐ సహాయంతో ఈ వివరాలను సులభంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. మొబైల్ ఫోన్ ద్వారానే ఈ వివరాలను సులువుగా మార్చుకోవచ్చు. ఇందుకోసం https://ssup.uidai.gov.in/ssup/ వెబ్ సైట్ లింక్ లో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయాలి. ఆధార్ నంబర్ ను ఎంటర్ చేసిన తర్వాత పేరు, పుట్టిన తేదీ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 8, 2021 / 03:07 PM IST
    Follow us on

    Aadhaar Card: మనలో చాలామంది ఆధార్ కార్డ్ లో పేరు, పుట్టినతేదీ వివరాలు తప్పుగా ఉండటం వల్ల ఇబ్బంది పడుతుంటారు. యూఐడీఏఐ సహాయంతో ఈ వివరాలను సులభంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. మొబైల్ ఫోన్ ద్వారానే ఈ వివరాలను సులువుగా మార్చుకోవచ్చు. ఇందుకోసం https://ssup.uidai.gov.in/ssup/ వెబ్ సైట్ లింక్ లో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయాలి.

    ఆధార్ నంబర్ ను ఎంటర్ చేసిన తర్వాత పేరు, పుట్టిన తేదీ మార్చుకోవడానికి అవసరమైన ధృవపత్రాలను అందజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సేవారుసుము 50 రూపాయలు చెల్లించాలి. ఆధార్ తో రిజిష్టర్ అయిన మొబైల్ నంబర్ ద్వారా మాత్రమే వివరాలను మార్చే అవకాశం అయితే ఉంటుంది. మొబైల్ నంబర్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సేవలను పొందే అవకాశం ఉంటుంది.

    ఆధార్ నిబంధనల ప్రకారం పుట్టినతేదీలలో ఒకసారి మాత్రమే మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. పుట్టినతేదీని ఒకసారి కంటే ఎక్కువగా మార్చాలంటే మాత్రం ప్రత్యేక పద్ధతి ద్వారా మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువసార్లు పుట్టినతేదీని మార్చాలంటే మాత్రం ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నంబర్ లేదా ఈ మెయిల్ ఐడీని అప్ డేట్ చేయడానికి ఆధార్ కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది.

    యూఐడీఐఏ భద్రత కోణం దృష్ట్యా ఆన్ లైన్ లో మొబైల్ నంబర్ ను అప్ డేట్ చేస్తే అవకాశం కల్పించడం లేదు. ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా ఆన్ లైన్ లో మొబైల్ నంబర్ మారితే అనేక సమస్యలు వస్తాయి. అందువల్ల మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడి అప్ డేట్ చేయాలంటే ఆధార్ కేంద్రానికి వెళితే మంచిది.