
చనిపోయాడని భావిస్తున్న అల్ ఖైదా ఉగ్రసంస్థ చీఫ్ అయ్ మాన్ అల్-జవహిరి బతికే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా 9/11 దాడి జరిగి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అల్ ఖైదా మీడియా అస్-సహబ్ పోస్టు చేసిన వీడియోలో జవహిరి కనిపించాడు. లాడెన్ ను అమెరికా మట్టుబెట్టిన తర్వాత జవహిరి అల్ ఖైదా బాధ్యతలు తీసుకున్నాడు. చాలాకాలంగా అండర్ గ్రౌండ్ లోఉన్న అతడు మరణించినట్లు గతేడాది నవంబర్ లో వార్తలు వచ్చాయి.