
కరోనా కారణంగా మూసివేసిన ఆలయాలను దశల వారిగా భక్తుల దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని స్వామి నారాయణ్ అక్షర్‌ధామ్ ఆలయంకు అక్టోబర్ 13 నుండి భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అయితే కోవిడ్ నిబంధనలలో భాగంగా సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు.