
దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. 24గడిచిన గంటల్లో పాజిటివ్ కేసుల సంఖ్య 2683గా నమోదవ్వగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,90,613గా ఉన్నట్లు ఢిల్లీ ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా వైరస్ నుంచి 3126 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 2,60,350 మంది డిశ్చార్జి అయ్యారు. ఒక్కరోజులో 38మంది మృతి చెందగా మొత్తంగా 5510గా వుంది. ఇప్పటి వరకు 32,81,784 టెస్టులు చేసినట్లు చెప్పింది. రాష్ట్రంలో కొవిడ్ పాజిటివిటీ రేటు 5.28శాతంగా ఉండగా, మరణాల రేటు 1.9శాతంగా ఉందని వివరించింది.