
తాలిబన్ల కారణం గా ఆఫ్ఘనిస్థాన్ దేశం మొత్తం సతమతమవుతోంది. తాజాగా క్రికెట్ పై కూడా ఆ ప్రభావం పడింది. పాకిస్థాన్ తో ఆఫ్ఘనిస్థాన్ ఆడాల్సిన మూడు వన్డేల సిరీస్ వాయిదా వేస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. సెప్టెంబర్ తొలి వారంలో శ్రీలంకలో ఈ సిరీస్ జరగాల్సి ఉంది. అయితే ఆఫ్ఘనిస్థాన్ లో ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. దీంతో అక్కడి క్రికెట్ బోర్డు సిరీస్ ను వాయిదా వేయాల్సిందిగా పీసీబీని కోరింది.