Corona Third Wave: బీ అలెర్ట్: సెప్టెంబర్ లోనే థర్డ్ వేవ్

Corona Third Wave: దేశంలో కరోనా మూడో దశ(Corona Third Wave) ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. సెప్టెంబర్ (September), అక్టోబర్ (October) నెలల్లో దేశంలో థర్డ్ వేవ్ తన ప్రభావం చూపనుందని రెండు సంస్థలు కేంద్రాన్ని హెచ్చరించాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. సెప్టెంబర్ లో రోజుకు దాదాపు 5 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నాయి. ఈ మేరకు జాతీయ ప్రకృతి వైపరీత్య నిర్వహణ సంస్థ నీతి ఆయోగ్ కేంద్రాన్ని […]

Written By: Srinivas, Updated On : August 24, 2021 1:19 pm
Follow us on

Corona Third Wave: దేశంలో కరోనా మూడో దశ(Corona Third Wave) ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. సెప్టెంబర్ (September), అక్టోబర్ (October) నెలల్లో దేశంలో థర్డ్ వేవ్ తన ప్రభావం చూపనుందని రెండు సంస్థలు కేంద్రాన్ని హెచ్చరించాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. సెప్టెంబర్ లో రోజుకు దాదాపు 5 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నాయి. ఈ మేరకు జాతీయ ప్రకృతి వైపరీత్య నిర్వహణ సంస్థ నీతి ఆయోగ్ కేంద్రాన్ని అప్రమత్తం చేస్తోంది. కరోనా మూడో దశ ముప్పుపై నివేదికను ప్రధానమంత్రి కార్యాలయానికి అందజేసింది. కొవిడ్ – 19 ముప్పుపై ఆందోళన వ్యక్తం చేసింది.

ఆగస్టులోనే రోజుకు 4 నుంచి 5 లక్షల కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. మూడో దశలో ఆస్పత్రుల్లో 23 శాతం మంది చేరతారని దాదాపు రెండు లక్షల ఐసీయూ పడకలను కేంద్రం సిద్ధం చేసుకోవాలని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ పేర్కొన్నారు. కరోనా మూడో దశ ముప్పు అక్టోబర్ చివరికల్లా దేశంలో ఉధృతి కనిపిస్తుందని పేర్కొంది. ఇది చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపుతుందని ఆధారాలు లేకున్నా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కరోనా మూడో దశ ముప్పును తొలగించుకోవాలంటే ప్రజలు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఒకవేళ మూడో ముప్పు వస్తే పిల్లలను ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలనే దానిపై ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం 7.6 శాతం మంది మాత్రమే పూర్తిస్థాయిలో టీకాలు వేసుకోవడం జరిగిందన్నారు. డోసుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రోగనిరోధక శక్తి పెంచుకుని కరోనా నిర్మూలనకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. రోగ నిరోధక శక్తి పెరిగితే అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు తక్కువని తెలిసిందే.

80-90 శాతం మంది రోగ నిరోధక శక్తి సాధిస్తేనే హెల్త్ ఇమ్యూనిటీ సాధ్యమయ్యే పరిస్థితి నెలకొంది. నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో మూడో వేవ్ తథ్యమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మూడో దశ వస్తే తొలుత వ్యాక్సిన్ తీసుకోని వారిపైనే ప్రభావం చూపే అవకాశం ఉంది. థర్డ్ వేవ్ ను ఎదుర్కోవాలంటే ఇప్పటినుంచే సమాయత్తం కావాలని చెబుతున్నారు

కరోనా థర్డ్ వేవ్ ముప్పును తొలగించుకోవాలని అధికారులు కూడా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ చైతన్యం చేయాలని పేర్కొన్నారు. వైద్య పరికరాలు, సదుపాయాలు కల్పించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని చూస్తున్నారు. పిల్లల కోసం ప్రత్యేక ఆస్పత్రులు కేటాయించాలని ప్రణాళికలు వేస్తున్నారు.