Weight Lose Tips: సమయపాలన లేని ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవనశైలి వల్ల రోజురోజుకు అధిక బరువుతో బాధ పాడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అధిక బరువు వల్ల చాలామందిని ఇతర అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. బరువు పెరిగిన తర్వాత బరువు తగ్గాలని ప్రయత్నించినా చాలామంది ఆ ప్రయత్నంలో సక్సెస్ కావడం లేదు. అయితే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి.
ప్రతిరోజూ ఉదయం సమయంలో ఒకటి లేదా రెండు గ్లాసుల గోరువెచ్చని నీటిని తాగాలి. గోరువెచ్చని నీళ్లు శరీరంలోని కొవ్వు కణాలను కరిగించడంతో పాటు జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేయడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ శరీరానికి ఎండ తగిలే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్యకాంతి వల్ల శరీరంలోకి విటమిన్ డి చేరడంతో పాటు ఎముకలు బలంగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి.
ప్రతిరోజూ ఉదయం సమయంలో 20 నుంచి 25 నిమిషాల పాటు వర్కౌట్లు చేయడం మంచిది. వర్కౌట్లు చేయడం వల్ల జీవక్రియ పెరగడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. వేగంగా బరువు తగ్గడంలో మెరుగైన జీవక్రియ తోడ్పడుతుంది. సరైన పోషకాహారం తీసుకుంటూ వ్యాయామం చేయడం ద్వారా కూడా సులభంగా బరువును తగ్గించుకోవచ్చు. క్రమం తప్పకుండా ఆహారం తింటూ పీచు, ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే బరువు తగ్గవచ్చు.
చన్నీటి స్నానం వల్ల శరీరంలో స్తంభింపచేసిన కొవ్వు కణజాలాన్ని సక్రియం చేసుకోవచ్చు. ప్రతిరోజూ చల్లనీటితో స్నానం చేస్తే జీవక్రియ రేటు పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.