The Raja Saab: ది రాజా సాబ్ సినిమా నుంచి అదిరిపోయే అప్ డెట్ వచ్చింది. ఈ సినిమా టీజర్ జూన్ 16న రానున్నట్లు తెలిపింది. అలాగే డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ పోస్టర్ ను పంచుకుంది. ప్రభాస్ మొదటిసారి హారర్ నేపథ్యంలో ఉన్న కథలో నటిస్తుండటంతో అందరి ఫొకస్ ది రాజాసాబ్ పైనే ఉంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధికుమార్, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.