ఛాన్స్ ల కోసం మాజీ హీరోయిన్లు చేస్తోంది అదే !

సీనియర్ హీరోయిన్లు ఈ మధ్య ఒకటి బాగా నేర్చారు. నేను నా ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయించాలి, మంచి పాత్ర వస్తేనే తిరిగి నటిస్తాను మరీ ముఖ్యంగా నేను చేసే పాత్రలో ఫలానా షేడ్స్ ఉండాలి, అలాంటి క్యారెక్టర్ దొరికితే సినిమా చేస్తాను’ అంటూ అబ్బో… తెగ బిల్డప్ లు ఇస్తుంటారు. కట్ చేస్తే.. సినిమా అఫీస్ లో నిర్మాత టేబుల్ సాక్షిగా రెండు రోజులకు ఒకసారి వచ్చి.. రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాను, దయచేసి మీ సినిమాల్లో నా […]

Written By: admin, Updated On : May 1, 2021 11:28 am
Follow us on


సీనియర్ హీరోయిన్లు ఈ మధ్య ఒకటి బాగా నేర్చారు. నేను నా ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయించాలి, మంచి పాత్ర వస్తేనే తిరిగి నటిస్తాను మరీ ముఖ్యంగా నేను చేసే పాత్రలో ఫలానా షేడ్స్ ఉండాలి, అలాంటి క్యారెక్టర్ దొరికితే సినిమా చేస్తాను’ అంటూ అబ్బో… తెగ బిల్డప్ లు ఇస్తుంటారు. కట్ చేస్తే.. సినిమా అఫీస్ లో నిర్మాత టేబుల్ సాక్షిగా రెండు రోజులకు ఒకసారి వచ్చి.. రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాను, దయచేసి మీ సినిమాల్లో నా కోసం మంచి పాత్రను డిజైన్ చేయించండి ప్లీజ్ అంటూ..

ఆ నిర్మాత ఒప్పుకోవాలే గానీ, ఎలాంటి పాత్రలు చేయడానికైనా రెడీగా ఉంటారు, ఇది చాలమంది సీనియర్ హీరోయిన్లు చేసేదే. పైకి మాత్రం అరె సినిమాలా ఫుల్ బిజీ అండి అంటూ సొల్లు కబ్బుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తుంటారు. ప్రస్తుతం అలాంటి కబుర్లే చెబుతుంది మాజీ బబ్లీ బ్యూటీ మీనా. ‘నాకు నా కూతురు అంటే ప్రాణం, నా కూతురు కోసం ఎక్కువ సమయం కేటాయించాలి. అదే నా సర్వస్వం. అందుకే నాకు ఆఫర్ వస్తే, ఆ ఆఫర్ కోసం నా కూతుర్ని కూడా వదిలి సెట్స్ పైకి రావాలి అనిపించేలా ఉండాలి నా పాత్ర. అలాంటి పాత్రలను మాత్రమే నేను చేస్తాను’ అంటూ కనిపించిన ప్రతి మేనేజర్ కి చెప్పుకుంటూ పోతుందట మీనా.

మరి ఈ సీనియర్ హీరోయిన్ ప్రస్తుతం చేస్తోన్న సినిమాలలో అలాంటి పాత్రలే చేస్తోందా ? డబ్బులు కోసం వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది కదా. తల్లి వదిన పాత్రల్లో తెగ జీవించేస్తోంది కదా. ఏ.. తల్లి, వదిన పాత్రలకు మన సినిమాల్లో ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మనకు తెలిసిందే కదా. క్రేజ్ పోయాక ఇలా క్రేజీ మాటలనే చెప్పుకుని కాలం నెట్టుకొస్తున్నారు ఈ సీనియర్ హీరోయిన్లు. ఇవ్వన్నీ ఓపెన్ గా చెప్పలేరు కాబట్టి, బయటకు నటిగా తృప్తి కావాలంటూ.. మంచి క్యారెక్టర్ దొరికితేనే చేస్తాను, లేకపోతే చెయ్యను అంటూ మీనాలా బిస్కెట్ మాటలు చెబుతూ.. చాటుగా ఛాన్స్ ల కోసం రిక్వెస్ట్ లు పెడుతూ ఉంటారు.