https://oktelugu.com/

మళ్లీ షర్మిల సందడి.. ఈసారి ప్లాన్ ఏంటి?

తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో పార్టీ రిజిస్ర్టేషన్ ప్రక్రియను పూర్తి చేసుకుంటున్న ఆమె వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున జులై8న పార్టీ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. పార్టీ విధానాలు వెల్లడించనున్నారు. పార్టీ పేరు వైఎస్సార్ టీపీ అని ఖరారు చేసిన విషయం తెలిసిందే. అన్నిజిల్లాలకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని లోటస్ […]

Written By: , Updated On : June 9, 2021 / 09:48 AM IST
Follow us on

YS Sharmilaతెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో పార్టీ రిజిస్ర్టేషన్ ప్రక్రియను పూర్తి చేసుకుంటున్న ఆమె వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున జులై8న పార్టీ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. పార్టీ విధానాలు వెల్లడించనున్నారు. పార్టీ పేరు వైఎస్సార్ టీపీ అని ఖరారు చేసిన విషయం తెలిసిందే.

అన్నిజిల్లాలకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఇందులో అన్ని జిల్లా, మండల, గ్రామస్థాయిలో పార్టీనిబలోపేతం చేసే విధంగా కార్యాచరణపై దృష్టి సారించనున్నారు. పార్టీ పేరు ప్రకటించిన తరువాత క్షేత్రస్థాయిలో ఎలా తీసుకెళ్లాలనే విషయంపై చర్చించనున్నారు

పార్టీ ఆవిర్భావ ప్రకటన, చేరికలు, పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ ఇవన్నీ ఈ విస్తృత స్థాయి సమావేశంలో చర్చకు రానున్నాయి. పార్టీలో చేరికల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని షర్మిల అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి అంకితభావాన్ని కనబరిచే వారిని ప్రోత్సహించాలని భావిస్తున్నారు.

ప్రస్తుతం ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఉద్యమిస్తోన్న వైఎస్ షర్మిల గ్రామస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర సామాజికాంశాలపైన పోరాడుతారని పాదయాత్ర చేపట్టడం ద్వారా ఆయా సమస్యలను తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తారని పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.