
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 77,930 పరీక్షలు నిర్వహించగా 7754 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,43,360 కి చేరింది. మరోవైపు కొవిడ్ తో చికిత్స పొందుతూ మరో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ చనిపోయిన వారి సంఖ్య 2,312 గా ఉంది. ఇక కరోనానే తాజాగా 6,542 మంది జయించగా ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 3,62,160కి చేరింది.