
ఖానామెట్ భూముల వేలం ప్రక్రియ ముగిసింది. ఖానామెట్ లో ఉన్న 14,91 ఎకరాలను 5 ప్లాట్లుగా విభజించి శుక్రవారం హెచ్ఎండీఏ ఆన్ లైన్ వేలం నిర్వహించగా రూ. 729.41 కోట్ల ఆదాయం సమాకూరింది. భూముల వేలంలో ఎకరం సగటు ధర రూ. 48,92 కోట్లు, గరిష్టంగా రూ. 55 కోట్లు పలికింది. ఈ ప్రాంతంలో వాణిజ్య పరమైన సముదాయాలు, వినోదభరిత ప్రాంతాలు, రవాణా సౌకర్యం ఉండడంతో ఖానామెట్ భూములు అధిక ధర పలికాయి.