
దేశంలో రోజువారి కొవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తుండగా మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 4,329 మరణాలు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య శాఖ మంగళవారం తెలిపింది. మరో వైపు కొత్తగా 2,63,533 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదై కేసులతో మొత్తం కేసుల సంఖ్య 2,52,28,996కు చేరింది. ఇప్పటి వరకు 2,15,96,512 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 33,53,765 యాక్టివ్ కేసులు ఉన్నాయని మంత్రిత్వశాఖ తెలిపింది.