
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. రెండు రోజుల పాటు 40 వేలకు దిగువన నమోదైన కేసులు.. తాజాగా 41వేలు దాటాయి. అయితే గత 21 రోజులుగా పాజిటివ్ కేసులు 50 వేల కంటే తక్కువగా ఉంటున్నాయి. కాగా శనివారం నాటికంటే ఆదివారం నమోదైన కేసుల సంఖ్య 7.4 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 41,157 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. మరో 42,004 మంది కోలుకోగా, 518 మంది మృతి చెందారు. మొత్తం కేసుల్లో 4,22,660 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.