
తెలంగాణలో ఇవాళ కొత్తగా 3,821 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 4,298 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 22 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 5,60,141 కి పెరిగాయి. 5,18,266 మంది కోలుకున్నారు. మొత్తం యాక్టివ్ కేసులు 38,706కి చేరాయి. 3169 మంది మరణించారు. ఇవాళ 81,203 శ్యాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.