Site icon OkTelugu

కరోనా మరణాలకు కేంద్రానిదే బాధ్యత.. ప్రియాంక గాంధీ

కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే కొవిడ్ సెకండ్ వేవ్ వ్యాప్తితో పెద్ద సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నాయని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. కరోనా విలయానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి వ్యాప్తికి బాధ్యలెవరనే పేరుతో సోషల్ మీడియాలో ప్రచార కార్యక్రమాన్ని ప్రియాంక ప్రారంభించారు. సెకండ్ వేవ్ వ్యాప్తితో ఆక్సిజన్ పడకలు, వ్యాక్సిన్లు, మందులు అందుబాటులో లేక ప్రజలు మరణిస్తుంటే కేంద్ర ప్రభుత్వం చోద్యం చూసిందని ఆరోపించారు.

Exit mobile version