
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఒక్కో అప్ డేట్ విడుదలవుతోంది. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ ను ప్రకటించిన రాజమౌళికి కరోనా బ్రేక్ వేసేలా ఉంది. తాజాగా మరో అప్ డేట్ ను రాజమౌళి తండ్రి పంచుకున్నారు. కొమురం భీం పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ విజువల్స్ ను విజయేంద్రప్రసాద్ చూశాడట.. ఆర్ఆర్ఆర్ కథను తయారు చేసింది విజయేంద్రప్రసాద్ నే. రాజమౌళి తీసిన ఆ సీన్ల గురించి తాజాగా పంచుకున్నారు.
ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ కు జోడిగా హాలీవుడ్ భామ ఒలీవియా మోరీస్ నటిస్తోంది. తారక్ ప్రేయసిగా ఒలీవియా నటిస్తోంది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్, కొమురం భీంగా ఎన్టీఆర్ కనిపించనున్నాడు. అజయ్ దేవగణ్, శ్రియా, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అక్టోబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది.
తాజాగా సినిమాలో ఓ భావోద్వేగమైన సన్నివేశం గురించి విజయేంద్రప్రసాద్ పంచుకున్నారు. ఈ సినిమాలో రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ జైలులో కలిసే సీన్ అందరినీ ఎమోషనల్ గా ఏడిపిస్తుందని.. అలాంటి సీన్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయని తెలిపారు.
ఇక విజయేంద్రప్రసాద్ మరో సన్నివేశం గురించి చెప్పి ఆర్ఆర్ఆర్ పై అంచనాలు రెట్టింపు చేశాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ ఇంతవరకు చూపించని ఎమోషనల్ యాంగిల్ ఇందులో చూస్తారని.. ఓ ఫైట్ సన్నివేశం చూసి నేనే కన్నీళ్లు పెట్టుకున్నానని విజయేంద్రప్రసాద్ చెప్పుకొచ్చాడు.
ఏకంగా రాజమౌళి తండ్రి ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పేసరికి నందమూరి అభిమానుల్లో ఆశలు పెరిగిపోయాయి. దీనిపై ఇంకా చెప్పాలని సోషల్ మీడియాలో విజయేంద్రప్రసాద్ ను అడుగుతున్నారు.