2022లో అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆప్ జాతీయ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రజలకు హామీలు కురిపిస్తున్నారు. ఇటీవల పంజాబ్, ఉత్తరాఖండ్ లో పర్యటించిన ఆయన తాజాగా గోవా సందర్శించారు. తమ పార్టీకి అధికారం అప్పగిస్తే రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి నెలకు 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఈసారి తమకు అవకాశం ఇస్తే గత విద్యుత్ బిల్లులన్నీ మాఫీ చేస్తామన్నారు. తద్వారా గోవాలో 87శాతం మంది ప్రజలకు విద్యుత్ బిల్లులు కట్టాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. రైతులకు కూడా ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు.