హిందీ మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసింది ‘అన్మోల్ చౌదరి’. కాలం కలిసి రాలేక, అవకాశాలు రాలేదు. చివరకు సోషల్ మీడియాలో బాగా హడావిడి చేసి స్టార్ అయింది. అయితే తాజాగా ‘అన్మోల్ చౌదరి’ తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని షాకింగ్ విషయాలు చెప్పింది. గతేడాది ‘అన్మోల్ చౌదరి’ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుండి ఆమె సింగిల్ మదర్ గానే తన బాబు ఆలనాపాలనా చూసుకుంటుంది.
మరి, తన బిడ్డకు తండ్రి ఎవరు ? అంటూ ఆమెను ఎంతమంది నెటిజన్లు ప్రశించినా ‘అన్మోల్ చౌదరి’ ఎప్పుడు దాని గురించి మాట్లాడటానికి ఆసక్తి చూపించలేదు. కానీ, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన బిడ్డకు తండ్రి ఎవరు అనే టాపిక్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. ఆమె మాటల్లోనే ‘నేను గతంలో ఓ వ్యక్తిని ప్రేమించాను. రెండేళ్లపాటు నేను అతడితో సహజీవనం కూడా చేశాను.
మొదట్లో అంతా బాగుంది. పెళ్ళి కాకుండానే నేను అతన్ని భర్తగా స్వీకరించాను. దాంతో గత ఏడాది నేను గర్భం దాల్చాను. బిడ్డను వదిలించుకోమని అతను నన్ను ఒత్తిడి చేశాడు. నేను ఒప్పుకోలేదు. అమ్మతనాన్ని ఆస్వాదించాలనుకున్నాను. దాంతో అతను నా పై కోపాన్ని పెంచుకుని నాకు దూరం అయ్యాడు. నిజానికి నేను గర్భం దాల్చాన విషయం అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆఖరికి నా తల్లిదండ్రులకు కూడా ఈ విషయం తెలీదు.
పెళ్లి కాకుండానే గర్భవతి అయ్యాను, అందరూ నన్ను నిందిస్తారని భయపడ్డాను, అందుకే ఈ విషయం గురించి ఎవరికీ చెప్పలేదు. ఆ సమయంలో నా సోదరి నాకు అండగా నిలబడింది. డెలివరీ సమయంలో కూడా తనే నా దగ్గరుంది. బిడ్డ పుట్టాక, నా మాజీ బాయ్ ఫ్రెండ్ మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు. నా బిడ్డకి తండ్రి ఉండాలన్న ఆశతో నేను అతనితో కలిసిపోవాలనుకున్నాను. కానీ అది కుదరలేదు. ఒకవేళ అతను నా కొడుకును కలవాలనుకుంటే నాకెలాంటి అభ్యంతరం లేదు” అంటూ అన్మోల్ చౌదరి ఎమోషనల్ గా చెప్పింది.