కవితపై ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు
ఎంపీ అర్వింద్ సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో సంచలనంగా మారుతున్నాయి. అర్వింద్, కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా కవిత పోటీ చేద్దాం అనుకున్నారని అందుకే 4 వేల ఇళ్లను మంజూరు చేయించుకున్నారని ఆరోపించారు. కవిత ఎమ్మెల్యే గా గెలిస్తే కేటీఆర్ కు పోటీ వస్తుందని, సీఎం పదవికి కవిత కాంపిటిషన్ వచ్చేదని చెప్పారు. […]
Written By:
, Updated On : July 14, 2021 / 03:50 PM IST

ఎంపీ అర్వింద్ సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో సంచలనంగా మారుతున్నాయి. అర్వింద్, కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా కవిత పోటీ చేద్దాం అనుకున్నారని అందుకే 4 వేల ఇళ్లను మంజూరు చేయించుకున్నారని ఆరోపించారు. కవిత ఎమ్మెల్యే గా గెలిస్తే కేటీఆర్ కు పోటీ వస్తుందని, సీఎం పదవికి కవిత కాంపిటిషన్ వచ్చేదని చెప్పారు. మహిళలది టఫ్ కాంపిటీషన్ సీఎం కేసీఆర్, కేటీఆర్ తట్టుకోలేరని హెచ్చరించారు.