
వ్యాక్సినల్ కొరతతో జనం అవస్థలు పడుతున్న నేపథ్యంలో తెలంగాణకు 3 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. పుణె నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఈ వ్యాక్సిన్ ను కోఠిలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలిస్తున్నారు. టీకా కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారి వివరాల వారీగా ఆయా జిల్లాలకు ఇక్కడి నుంచి టీకా పంపిణీ చేయనున్నారు.