సీని స్టార్స్ అంటే సామాన్యుల్లో ఉండే అభిమానం, ఆరాధన అలా ఇలా ఉండదు. తాము అబిమానించే హీరో, హీరోయిన్స్ కోసం కొందరు వీరాభిమానులు గుడులు కూడా కట్టిన సందర్బాలున్నాయి తాజాగా అల్లు అర్జున్ వీరాభిమాని ఒకరు 250 కిలోమీటర్ల పాదరయాత్ర చేసి వార్తల్లోకెక్కారు. గుుంటూరు జిల్లా మాచర్ల మండలం కంభంపాడు గ్రామానికి చెందిన పి.నాగేశ్వరరావు అనే యువకుడు బన్ని సినిమాలు, అతని వ్యక్తిత్వానికి ఫిదా అయి బన్నిని కలవడానికి మాచర్ల నుంచి హైదరాబాదు వరకు పాదయాత్ర చేపట్టినట్లు చెప్తున్నాడు. దీనిద్వారా తనను బన్నీ గుర్తిస్తాడని నాగేశ్వరరావు భావించాడు. ఈ నెల 17న మాచర్లలో పాదరయాత్ర ప్రారంభించి ఇవాళ్టికి హైదరాబాద్ చేరుకున్నాడు. చేతిలో ప్లకార్డుతో కనిపించిప ఆయువకుడ్ని ఓపాత్రికేయుడు పలికరించగా ఈవిషయంను తెలిపాడు.
Also Read: నమ్రతను నేను గౌరవిస్తా..: బండ్ల గణేశ్ కామెంట్స్