https://oktelugu.com/

 ఆర్టీసీ ప్రయాణికులకు హ్యాపీ న్యూస్‌

దేశంలో ఎప్పుడైతే లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి రవాణా సర్వీసులన్నీ బంద్‌ అయ్యాయి. మెల్లమెల్లగా అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభించిన కేంద్రం.. ఎట్టకేలకు ఆర్టీసీ సేవలకు అనుమతి ఇచ్చింది. కానీ.. వాటికీ కొవిడ్‌ నిబంధనలు విధించింది. ఫిజికల్‌ డిస్టెన్స్‌ తప్పనిసరి చేస్తూ గైడ్‌లైన్స్‌ ఇచ్చింది. దీంతో బస్సుల్లో సగం మంది ప్రయాణికులను ఎక్కించాల్సిన పరిస్థితి. ప్రస్తుతం తిరుగుతున్న ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల రిజర్వేషన్ సందర్భంగా సీటుకూ, సీటుకూ మధ్య టికెట్‌ బుక్‌ చేయడం లేదు. Also Read: […]

Written By:
  • NARESH
  • , Updated On : September 23, 2020 12:48 pm
    rtc bus

    rtc bus

    Follow us on

    rtc bus

    దేశంలో ఎప్పుడైతే లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి రవాణా సర్వీసులన్నీ బంద్‌ అయ్యాయి. మెల్లమెల్లగా అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభించిన కేంద్రం.. ఎట్టకేలకు ఆర్టీసీ సేవలకు అనుమతి ఇచ్చింది. కానీ.. వాటికీ కొవిడ్‌ నిబంధనలు విధించింది. ఫిజికల్‌ డిస్టెన్స్‌ తప్పనిసరి చేస్తూ గైడ్‌లైన్స్‌ ఇచ్చింది. దీంతో బస్సుల్లో సగం మంది ప్రయాణికులను ఎక్కించాల్సిన పరిస్థితి. ప్రస్తుతం తిరుగుతున్న ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల రిజర్వేషన్ సందర్భంగా సీటుకూ, సీటుకూ మధ్య టికెట్‌ బుక్‌ చేయడం లేదు.

    Also Read: మోడీ సార్ టూర్ ల ఖర్చు ఎంతో తెలుసా?

    కరోనా ప్రభుత్వ, ప్రైవేటు రంగాలపై భారీ ప్రభావమే చూపింది. ఆ ప్రభావం రాష్ట్రాల్లోని ఆర్టీసీ మీద చాలావరకు పడింది. కరోనా కారణంగా ఎక్కడికక్కడ సర్వీసులు నిలిచిపోవడంతో ఆర్టీసీ ఆదాయం కోల్పోయింది. ఇప్పటికే నష్టలతో నడుస్తున్న ఏపీఎస్‌ ఆర్టీసీ మరింత లోతుల్లోకి వెళ్లింది. దీంతో ఆర్టీసీ సర్వీసులు నడిపేందుకు కేంద్రం ఎప్పుడు అనుమతి ఇస్తుందా అని ప్రభుత్వం కూడా ఎదురుచూసింది. అన్‌లాక్‌ ప్రక్రియతో అనుమతి లభించడంతో ప్రభుత్వం బస్సులను రోడ్లపైకి పంపింది. భౌతిక దూరంతోపాటు ఇతర నిబంధనలు అమలు చేసినా చాలా రోజులపాటు ప్రయాణికులు అంతలా ఆదరణ లభించలేదు. ఇప్పటికీ కరోనా ముందు పరిస్థితులు రావనే చెప్పాలి.

    అయితే.. కేంద్రం ఇచ్చిన ఫిజికల్‌ డిస్టెన్స్‌ నిబంధనలతో భారీ నష్టాలు తప్పలేదు. ఇప్పుడు ఏపీ కొత్తగా భౌతిక దూరం నిబంధనను పక్కనబెట్టి ఆన్‌లైన్ రిజర్వేషన్లలో అన్ని సీట్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ నిర్ణయంతో ఇప్పటివరకూ సగం సీట్లతోనే రాకపోకలు సాగించిన ఆర్టీసీ బస్సులు ఇకపై పూర్తి సామర్థ్యంతో తిరుగుతాయి. దీంతో ఆర్టీసీ ఆదాయం కూడా పెరగనుంది. ఒక్క ఫిజికల్‌ డిస్టెన్స్‌ తప్ప మిగితా కోవిడ్‌ నిబంధనలు పాటించేలా ప్రయత్నిస్తున్నారు.

    Also Read: జగన్‌కు మోడీ సాయం ఎంతవరకు..?

    ఇన్నాళ్లు సగం సీట్లతో ఇబ్బందులు పడ్డ ప్రయాణికులకు ఒకందుకు ఇది హ్యాపీ న్యూస్‌ అనే చెప్పొచ్చు. పూర్తిస్థాయిలో సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ ప్రక్రియ అందుబాటులోకి రావడంతో ప్రయాణికుల ఇబ్బందులు తీరనున్నాయి. ముఖ్యంగా వీకెండ్‌లో, రద్దీ రూట్లలో దీని వల్ల ప్రయోజనం ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇంకా రద్దీ పెరిగితే భవిష్యత్తుల్లో మరిన్ని సర్వీసులు అందుబాటులోకి తీసుకువస్తామని అంటున్నారు. ఏపీలో రెండు వారాలుగా కరోనా ప్రభావం తగ్గుతూ వస్తుండడంతో ఆర్టీసీ ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయవాడ, విశాఖల్లో సిటీ బస్సులను కూడా స్టార్ట్‌ చేశారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో పూర్తిస్థాయిలో సీట్ల భర్తీకి నిర్ణయం తీసుకుంది.