
తెలంగాణలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,070 మందికి కొవిడ్ పాజిటివ్ గా తేలింది. కరోనా నుంచి 3,762 మంది బాధితులు కోలుకోగా మరో 18 మంది మృతి చెందారు. ఇవాళ 1,38,182 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 29,208 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.