గొప్ప మనసు చాటుకున్నజగన్

సాయం చేయడంలో జగన్ ను మించిన వారు లేరని తెలుస్తోంది. దానంలో కర్ణుడిగా కనిపిస్తున్నారు. ఎల్జీపాలిమర్స్ ఘటనలో బాధితులకు ఊహించని విధంగా ఒక్కో బాధిత కుటుంబానికి రూ. కోటి ప్రకటించి శభాష్ అనిపించుకున్నారు. తాజాగా ఓ ప్రభుత్వ వైద్యుడి వైద్య ఖర్చుల కోసం రూ.కోటి మంజూరు చేసి తన పెద్ద మనసు చాటుకున్నారు. సదరు ప్రభుత్వ వైద్యుడి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కవిటి […]

Written By: Srinivas, Updated On : June 5, 2021 6:47 pm
Follow us on

సాయం చేయడంలో జగన్ ను మించిన వారు లేరని తెలుస్తోంది. దానంలో కర్ణుడిగా కనిపిస్తున్నారు. ఎల్జీపాలిమర్స్ ఘటనలో బాధితులకు ఊహించని విధంగా ఒక్కో బాధిత కుటుంబానికి రూ. కోటి ప్రకటించి శభాష్ అనిపించుకున్నారు. తాజాగా ఓ ప్రభుత్వ వైద్యుడి వైద్య ఖర్చుల కోసం రూ.కోటి మంజూరు చేసి తన పెద్ద మనసు చాటుకున్నారు. సదరు ప్రభుత్వ వైద్యుడి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కొత్తపుట్టుగకు చెందిన డాక్టర్ ఎన్. భాస్కర్ రావు ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్ సీలో వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సుమారు 6 వేల మదికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ నిర్ధారణ అయిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించి ప్రాణదాతగా నిలిచారు. ఏప్రిల్ 24న ఆయన సైతం కరోనా బారిన పడ్డారు. నెలాఖరు వరకు హోం ఐసోలేషన్ లో ఉన్నారు. అయితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో విజయవాడ ఆయుష్ ఆస్పత్రిలో చేర్చారు.

అక్కడ పదిరోజులు వైద్యం చేయించుకున్నా ఫలితం దక్కలేదు. దీంతో హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించారు. అనంతరం గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రిలో చేర్చారు. ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని, అందువల్లే శ్వాస తీసుకోవడంలో సమస్య వచ్చిందని తెలిపారు. వెంటిలేటర్ పై చికిత్సపొందుతున్న ఆయనకు ఊపిరితిత్తులు మార్చాలని వైద్యులు తేల్చారు. అందుకు రూ.1.50 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఆయన కుటుంబసభ్యులు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని కలిసి పరిస్థితిని వివరించారు. వెంటనే ఆయన ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం వెంటనే స్పందించి వైద్యుడి చికిత్స ఖర్చులకు రూ. కోటి మంజూరు చేశారు. అవసమైతే మిగిలిన సొమ్మును కూడా ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. సీఎం ఆదేశాలతో కుటుంబం ఊపిరి పీల్చుకుంది. కోవిడ్ వారియర్స్ విషయంలోనూ జగన్ ఇదే రీతిలో స్పందిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి