ఏపీలో జగన్ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఈ కాలంలో మంత్రులపై అనేక ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదు. మంత్రులు మంచి వారు కాదని తెలుసు. అయినా జగన్ వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే విషయం ఎవరికి అర్థం కావడం లేదు. పనితీరు సక్రమంగా లేకపోయినా చర్యలు తీసుకోవడానికి సైతం సిద్ధపడడం లేదు. మంత్రివర్గ విస్తరణ ఉండడమే దీనికి కారణమని తెలుస్తోంది.
జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అవినీతి సహించబోనని మంత్రులను హెచ్చరించారు. ఎక్కువ మందిపై ఆరోపణలు రాలేదు. పనితీరు కూడా బాగా లేదని తెలుస్తోంది. నలుగురైదుగురు మినహా అందరూ తమకు కేటాయించిన శాఖలపై పట్టించుకోక తిరుగుతున్నారని చెబుతున్నారు.
రెండేళ్లలో జగన్ ప్రభుత్వంలోని మంత్రులు క్షేత్రస్థాయిలో తిరగడం లేదు. కరోనా కారణంతో వెళ్లలేకపోతున్నామని చెబుతున్నారు. దీనిపై జగన్ సైతం ఏమీ మాట్లాడకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మంత్రులపై చర్యలు ఉంటాయో లేదోననే విషయం ఎవరికి బోధపడడం లేదు. ఈ నేపథ్యంలో మంత్రులు తమ శాఖలకు ఏ ఢోకా లేదని గుండెల మీద చేయి వేసుకుని మరీ తిరుగుతున్నారు.
జగన్ కేబినెట్ లో ఇద్దరు మంత్రులపై మాత్రమే ఆరోపణలు వచ్చాయి. దీంతో వారిపైనే చర్యలుంటాయని భావిస్తున్నారు. కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరి జయరాం, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ లపై ఆరోపణలు వచ్చాయి. విపక్షాలు సైతం వీరినే టార్గెట్ చేస్తున్నారు. ఏపీలో ఆలయాలపై దాడులు జరిగినా జగన్ వెల్లంపల్లిని తప్పించలేదు.