
దేశవ్యాప్తంగా ఇంతవరకూ 14 రాష్ట్రలకు 15,284 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను 936 ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసినట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. ఆదివారం ఉదయం తొలి ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ కు అసోందకు చేరిందని, 4 ట్యాంకర్లలో 80 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ అసోంకి డెలివర్ చేశామని రైల్వే శాఖ తెలిపింది. 234 పైగా ఆక్సిజన్ ఎక్సెప్రెస్ లను వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నడిపనట్లు పేర్కొంది.