
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతున్నది. థర్డ్ వేవ్ ముప్పు తప్పకపోవచ్చన్న నిపుణుల హెచ్చరికల మధ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మమమ్మారికి మెరుగైన చికిత్సలను అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. కొవిడ్ ప్యాకేజీ కింద ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు రూ. 1,827 కోట్లు విడుదల చేసింది. ప్యాకేజీ కింద మొత్తం రూ. 120,185 కోట్లు కేటాయించగా 15 శాతం నిధులను విడుదల చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు.