
విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురును అందించింది. 158 టెక్నీషియన్ అప్రెంటిస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగ ఖాళీల కోసం డిప్లొమా పాసైన వాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఆగష్టు 4 ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
ఈ ఉద్యోగ ఖాళీలు ఏడాది కాలవ్యవధి గల పోస్టులు కావడం గమనార్హం. https://www.vssc.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఏపీ, తెలంగాణతో పాటు కర్నాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చెరీ రాష్ట్రాల్లో డిప్లొమా పాసైన వాళ్లు సైతం ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి.
http://portal.mhrdnats.gov.in/ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసి పోస్టు ద్వారా ఎంపికైన వాళ్లకు ఆఫర్ లెటర్ ను అందజేస్తారు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు 8,000 రూపాయల చొప్పున స్టైఫండ్ లభిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయని సమాచారం.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, సివిల్ విభాగాల్లో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉండటం గమనార్హం.