
తెలంగాణ-ఛత్తీస్ గడ్ సరిహద్దు భద్రాచలం మన్యంలోని చర్ల అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసులు- మావోయిస్టుల మధ్య జరిగిన ఈ ఘటనలో ఓ మావోయిస్టు మృతిచెందాడు. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో సరిహద్దు ఆటవీ ప్రాంతాల్లో గ్రేహౌండ్స్ బలగాలు, ప్రత్యేక పోలీసు దళాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో మండలంలోని కీకారణ్యం ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. మృతిచెందిన మావోయిస్టు వద్ద 303 రైఫిల్ ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.