
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 86,223 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 11,421 కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే 81 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 11, 213కి చేరింది. గత 24 గంటల్లో 16,223 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో నిన్న అత్యధికంగా 13 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,38,912 యాక్టివ్ కేసులు ఉన్నాయి.