
ప్రపంచమంతా కరోనా ధాటికి వణికిపోతున్న వేళ మధ్యప్రదేశ్ లో 103 ఏళ్ల వృద్ధుడు ఆ మహమ్మారిని జయించాడు. బెతుల్ కు చెందిన బిర్దీచంద్ కి ఈ నెల 5 న కరోనా పాజిటివ్ వచ్చింది. తాను ఏ మాత్రం భయపడలేదని ఆసుపత్రికీ వెళ్లలేదని బిర్దీ చంద్ తెలిపారు. శాకాహారం తీసుకుంటూ వ్యాయామాలు చేస్తూ సానుకుాలంగా ఉన్నట్లు వెల్లడించారు. ఓ వైద్యుడు సూచించిన మందులను మాత్రం వాడినట్లు తెలిపారు.