కరోనా కల్లోలం: రాలిపోతున్న జర్నలిస్టులు

ఈ ఉదయం లేవగానే మరో జర్నలిస్టు దుర్మరణం వార్త కలిచివేసింది. ఈనాడు కరీంనగర్ యూనిట్ లో పనిచేసే సీనియర్ సబ్ ఎడిటర్ రంజాన్ అలీ (56) కరోనాతో చికిత్స పొందుతూ మరణించారు.ఆయన భార్యా పిల్లలను అనాథను చేశారు. ఈయన ఒక్కరే కాదు.. ఈ కరోనా కల్లోలంలో జర్నలిస్టులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు దిగ్గజ జర్నలిస్టులు ఎంతో మందిని కరోనా పట్టుకెళ్లిపోతోంది. ఇప్పటిదాకా అధికారిక లెక్కల ప్రకారమే గత ఏప్రిల్ 1వ తేదీ నుంచి […]

Written By: NARESH, Updated On : April 25, 2021 10:59 am
Follow us on

ఈ ఉదయం లేవగానే మరో జర్నలిస్టు దుర్మరణం వార్త కలిచివేసింది. ఈనాడు కరీంనగర్ యూనిట్ లో పనిచేసే సీనియర్ సబ్ ఎడిటర్ రంజాన్ అలీ (56) కరోనాతో చికిత్స పొందుతూ మరణించారు.ఆయన భార్యా పిల్లలను అనాథను చేశారు. ఈయన ఒక్కరే కాదు.. ఈ కరోనా కల్లోలంలో జర్నలిస్టులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు దిగ్గజ జర్నలిస్టులు ఎంతో మందిని కరోనా పట్టుకెళ్లిపోతోంది. ఇప్పటిదాకా అధికారిక లెక్కల ప్రకారమే గత ఏప్రిల్ 1వ తేదీ నుంచి 15మంది జర్నలిస్టులు చనిపోయినట్టు లెక్కలు చెబుతున్నాయి. సెకండ్ వేవ్ లో కరోనా జర్నలిస్టులపై కూడా ప్రభావం చూపుతోంది.

ఇప్పుడు ఏ ఒక్కరిని కదిలించినా కరోనాతో పడుతున్న బాధలే వినిపిస్తున్నారు. కుటుంబంలో ఒక్కరు అయినా దీంతో బాధపడుతున్నారు. ఇక అత్యవసర సేవల విభాగంలో ప్రతీరోజు పనిచేస్తూ వార్తలు సేకరించి అమర్చే జర్నలిస్టులను సైతం ఈ కరోనా బలితీసుకుంటోంది.

తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 15 మంది వరకు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారని తెలిసింది. తెలంగాణలో ఎక్కువమంది చనిపోతున్నారు. వీరిలో దిగ్గజ జర్నలిస్టుల నుంచి జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, డెస్క్ లో పనిచేసే సబ్ ఎడిటర్లు, స్టింగర్లు కూడా ఉన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ అమర్ నాథ్ ను సైతం కరోనా బలితీసుకుంది. జర్నలిస్టు ఉద్యమంలో ముందుండి నడిపించిన ఈయన కరోనాతో 10 రోజుల పాటు నిమ్స్ లో పోరాడారు. కానీ బతకలేకపోయారు. ఆయన మరణం తెలంగాణ జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

ఇక బతుకమ్మ టీవీ సీఈవో, శ్రీకాకుళం ఎన్టీవో రిపోర్టర్ చంద్రశేఖర్ కరోనాతో అసువులు బాసారు. సిద్దిపేట జిల్లా ఈనాడు స్టాఫర్ సైతం కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఈయన కుటుంబాన్ని మంత్రి హరీష్ రావు ఆదుకున్నారు.

అయితే ఇంత కరోనా ప్రబలుతున్నా కూడా మీడియా యాజమాన్యాలు జర్నలిస్టులకు వర్క్ ఫ్రం హోలాంటి సదుపాయాలు కల్పించడం లేదు. దీంతో ఏ ఒక్కరికి కరోనా ఉన్నా డెస్క్ మొత్తం సోకుతోంది. కరోనా తో చనిపోయినా వారికి మీడియా యాజమాన్యాలు సాయం చేయడం లేదన్న విమర్శ ఉంది. పత్రికలు, మీడియా కోసం అహర్నిసలు రాత్రిళ్లు కష్టపడుతున్న జర్నలిస్టుల సంక్షేమం గురించి అటు మీడియా యాజమాన్యాలు, ఇటు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కరోనాకు బలి అయిపోతున్నారు. తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలను పట్టుకొని బలిపీఠమెక్కుతున్నారు. అంపశయ్యపై పనిచేస్తూ చాలీచాలనీ జీతాలతో కరోనాతో పోరాడుతున్నారు.

*కరోనాతో చనిపోయిన జర్నలిస్టులు వీరే..

Telangana & Ap 13Members

1.K Amarnath, senior journalist, Hyderabad, Telangana (April 20)

2.Jayaprakash, journalist, Karimnagar District, Telangana (April 13)

3. Ranjan Ali, Eenadu senior sub Editor, karimnagar Unit  (April 24)

4.Sainath, reporter, 99tv, Nirmal District, Telangana (April 17)

5.D Ashok, reporter, Andhra Bhoomi, Nizamabad District, Telangana (April 17)

6.Bura Ramesh, journalist, Vemulawada, Sircilla District, Telangana (April 20)

7.P Ramesh, journalist, Karimnagar, Telangana (April 20)

8.Ch Naga Raju, reporter, Eenadu, Siddipet District, Telangana (April 21).

9.Ramachandra Rao, sub-editor, Sakshi, Hyderabad, Telangana (April 21)

10.Kalpana, CEO, Bathukamma TV, Hyderabad, Telangana (April 21)

11.P Tataiah, senior journalist, Ongole, Andhra Pradesh (April 22)

12.Chandrashekar Naidu, reporter, NTV Srikakulam, Andhra Pradesh (April 22)

13.Srinivasa Rao, reporter, Prajashakti Daily, Jaggaiahpet, Krishna District, Andhra Pradesh (April 22)