Homeబిజినెస్Best Fast Charging Electric Scooters 2026: ఫాస్ట్ గా చార్జింగ్ అయ్యే EV స్కూటర్లు...

Best Fast Charging Electric Scooters 2026: ఫాస్ట్ గా చార్జింగ్ అయ్యే EV స్కూటర్లు ఏవో తెలుసా?

Best Fast Charging Electric Scooters 2026: ప్రస్తుత కాలంలో చాలామంది రకరకాల పనులతో బిజీగా మారిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఏ చిన్న అవంతరం ఏర్పడిన తట్టుకోలేకపోతుంటారు. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోవడానికి మిగతా పనులను తగ్గించుకుంటూ ఉంటారు. అయితే అవే ప్రధానమైనప్పుడు మరింత ఒత్తిడి కలుగుతుంది. వీటిలో భాగంగా ఎలక్ట్రిక్ స్కూటర్కు చార్జింగ్ విషయంలో కొందరు ఆందోళన చెందుతున్నారు. గంటల తరబడి చార్జింగ్ పెట్టే అవసరం ఉన్నప్పుడు కొన్ని పనులు పూర్తికాక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని కొన్ని కంపెనీలు స్కూటర్లు ఫాస్టెస్ట్ చార్జింగ్ అయ్యే విధంగా సెట్ చేశారు. ఇవి వేగంగా చార్జింగ్ వినియోగదారుల సమయాన్ని ఆదా చేస్తుంది. దీంతో మిగతా పనులను పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి అలాంటి స్కూటర్లు ఏవో ఇప్పుడు చూద్దాం..

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వచ్చిన మొదట్లో Ola కంపెనీ EV ల అమ్మకాలను విస్తృతం చేసింది. అయితే ఇదే సమయంలో ఈ కంపెనీ S1 Pro Plus అనే స్కూటర్ వేగంగా చార్జింగ్ అయ్యే విధంగా సెట్ చేశారు. ఇందులో 4 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ బ్యాటరీ 12 నుంచి 15 నిమిషాల్లో 50 కిలోమీటర్ చార్జింగ్ అందిస్తుంది. అదే పూర్తిగా చార్జింగ్ అయితే 320 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. దీనిని మార్కెట్లో రూ.1.20 లక్షల ప్రారంభ ధర నుంచి విక్రయిస్తున్నారు. Either కంపెనీకి చెందిన 450 సిరీస్ కలిగిన స్కూటర్ లో 2.9 kWh నుంచి 3.7 kWh బ్యాటరీ బ్యాక్ వరకు ఉంటుంది. దీనికి ఎనిమిది సంవత్సరాల వారంటీ కూడా ఇస్తుంటారు. ఇది మూడు గంటల్లో 80 శాతం వరకు చార్జింగ్ అవుతుంది. నాలుగు గంటల 30 నిమిషాల్లో పూర్తి ఛార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో 161 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. దీనిని రూ.1.47 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

TVS కంపెనీ నుంచి బైక్ లేదా స్కూటర్ మార్కెట్లోకి వస్తుందంటే చాలామంది ఉత్సాహం చూపిస్తారు. దీని నుండి ఇప్పటికే రిలీజ్ అయి ఆకట్టుకుంటున్న iQube అనే స్కూటర్లో 2.2 kWh అనే బ్యాటరీని అమర్చారు. ఇది 2.45 గంటల సమయాల్లో 80 శాతం వరకు చార్జింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో ST వంటి మెరుగైన బ్యాటరీ ప్యాక్ ఉండనుంది. ఇది 1500 W ఫాస్టెస్ట్ చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. దీనిని మార్కెట్లో రూ.94434 ప్రారంభ ధరతో విక్రయిస్తుంటారు. ప్రముఖ కంపెనీ Bajaj నుంచి C2501 అనే స్కూటర్ మార్కెట్లోకి వచ్చి సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో 2.5 kWh బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంది. ఇది 2.25 గంటల సమయంలో పూర్తి చార్జింగ్ అయ్యే అవకాశం ఉంది. ఈ స్కూటర్ 151 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. దీనిని.87,100 ప్రారంభ ధరలతో విక్రయిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version