తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు అవసరాల శ్రీనివాస్. ఇప్పటి వరకు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన అవసరాల శ్రీనివాస్ తాజాగా నూటొక్క జిల్లాల అందగాడు అనే సినిమాతో హీరోగా ప్రేక్షకులు ముందుకు రానున్నారు. ఈ సినిమాలో శ్రీనివాస్ సరసన చిలసౌ ఫేమ్ రుహాని శర్మ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేశారు. ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచుతుంది. ఇందులో అవసరాల శ్రీనివాస్ బట్టతలతో కనిపిస్తారు. ట్రెండింగ్ మొదటి స్థానంలో ఉంది.