
కరోనా నియంత్రణకు ఉపయోగించే రెమ్ డెసివిర్ టీకా సరఫరా విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాలకు ఎంత మోతాదులలు సరఫరా చేయాలో వివరిస్తూ సంబంధిత సంస్థలకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు రాష్ట్రాల వారీగా జాబితాను కేంద్రం పంపింది. తెలంగాణకు 1.45 లక్షల డోసులు కేటాయించింది. ఇందులో హెటిరో 86,300 వయల్స్, మైలాన్ 45వేలు, షిన్జిన్ సన్ వేలు, జుబిలియంట్ 500, డాక్టర్ రెడ్డీస్ 11,200వయల్స్ సరఫరా చేయనున్నాయి.