
దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. తాజాగా 19,25,374 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,27,510 కొత్త కేసులు వెలుగుచూశాయి. అంతకుముందు రోజుతో పోల్చుకుంటే 16 శాతం తగ్గుదల కనిపించింది. వరుసగా ఐదోరోజు కేసులు తగ్గుముఖం పట్టాయని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. అలాగే 24 గంటల వ్యవధిలో 2,795 మంది ప్రాణాలు వదిలారు. ఏప్రిల్ చివరి నుంచి మే నెల మొత్తం భారీగా నమోదైన కరోనా మరణాలు నిన్న మూడు వేల దిగువకు చేరటం ఊరట కలిగిస్తోంది. మొత్తంగా 2,81,75,044 మంది వైరస్ బారిన పడగా 3,31,895 మంది మహమ్మారికి బలయ్యారు.