
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పరిధిలోని సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ సర్వే పనులను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు సోమవారం ప్రాంభించారు. మునిపల్లి మండలం లింగంపల్లి వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సర్వే పనులను ప్రాంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాఠిల్, ఎమ్మెల్యేలే జగ్గారెడ్డి, క్రాంతి కిరణ్, మహిపాల్ రెడ్డి, మండలి ప్రోటెం ఛైర్మన్ భూపల్ రెడ్డి హాజరయ్యారు.