బీ రెడీ.. కేసీఆర్ హడలెత్తిస్తారా?

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అధికారిక కార్యక్రమాల కోసం జిల్లాలు ఎంచుకుంటున్నారు.ఇందులో భాగంగా జిల్లా పరిస్థితులు అవగాహన చేసుకుని అక్కడ సమస్యలు తీర్చేందుకు అవకాశం దొరుకుతుంది భావిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో తప్ప పర్యటించిన కేసీఆర్ ప్రస్తుతం జిల్లాల పర్యటనకు వెళ్తుండటంతో అధికారుల్లో హైరానా మొదలైంది. జూన్ 20 నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన ప్రారంభమవుతున్నాయి. ఈ పర్యటనలో ఆకస్మికంగా కొన్ని చోట్ల పర్యటిస్తానని కేసీఆర్ అధికారవర్గాల్లో తేల్చి చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, […]

Written By: Srinivas, Updated On : June 14, 2021 2:19 pm
Follow us on

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అధికారిక కార్యక్రమాల కోసం జిల్లాలు ఎంచుకుంటున్నారు.ఇందులో భాగంగా జిల్లా పరిస్థితులు అవగాహన చేసుకుని అక్కడ సమస్యలు తీర్చేందుకు అవకాశం దొరుకుతుంది భావిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో తప్ప పర్యటించిన కేసీఆర్ ప్రస్తుతం జిల్లాల పర్యటనకు వెళ్తుండటంతో అధికారుల్లో హైరానా మొదలైంది.

జూన్ 20 నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన ప్రారంభమవుతున్నాయి. ఈ పర్యటనలో ఆకస్మికంగా కొన్ని చోట్ల పర్యటిస్తానని కేసీఆర్ అధికారవర్గాల్లో తేల్చి చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ప్రాజెక్టు గురించి ఎక్కడికక్కడ ఆయన పరిశీలన చేయనున్నారు. అదనపు కలెక్టర్ల కేసీఆర్ కియా కార్నివాల్ కార్ కేటాయించారు.

వాటిని అందజేయడానికి అడిషనల్ కలెక్టర్ అందరినీ ప్రగతి భవన్ కు పిలిపించారు. పనిలోపనిగా ప్రత్యేకంగా ఓ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. అందులో అధికారులు హెచ్చరికలు చేశారు. జూన్ 20న సిద్దిపేట,కామారెడ్డి జిల్లాలో తనిఖీలు చేస్తామని పేర్కొన్నారు. జూన్ 21న వరంగల్ జిల్లాలో ఆకస్మిక తనిఖీ అధికారులు ముందు చెప్పారు.

అయితే ఆయా జిల్లాల్లో ఎక్కడ వెళ్తున్న దానిపై స్పష్టత లేదు. కేసీఆర్ నిర్ణయించుకుంటారు అధికారులు ప్లేస్ డిసైడ్ చేస్తారు? అన్నది తేలాల్సి ఉంది. అధికారులు డిసైడ్ చేస్తే మాత్రం నిజాలు కేసీఆర్ కు తెలిసే అవకాశం లేదని కేసీఆర్ కు అన్ని జిల్లాల్లో ప్రభుత్వపరంగా ఎక్కడెక్కడ పనులు, ప్రాజెక్టులు జరుగుతున్నాయి తెలుసు కాబట్టి ఆయన ఎంపిక చేసుకుంటే వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటున్నారు.