
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ఆపన్నహస్తం అందించారు. మరోసారి తన మంచి మనసును, మానవతను చాటుకున్నారు. గతంలో ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్ కి ప్రిపేర్ అవుతూ లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న షాద్ నగర్ చెందిన విద్యార్థిని ఐశ్వర్య రెడ్డి కుటుంబాన్ని అదుకునేందుకు ముందుకు వచ్చారు. ఈరోజు వారిని ప్రగతి భవన్ కి ఆహ్వానించి రెండు లక్షల 50 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు.