
పులివెందుల ప్రజలు తనకు ఎప్పుడూ కుటుంబ సభ్యులేనని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఇక్కడి ప్రజల దీవెనల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పారు. నాన్న చనిపోయినా ఇక్కడి ప్రజలు తనను వీడలేదని, ఇక్కడి ప్రజలకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని జగన్ అన్నారు. రైతు దినోత్సవంలో భాగంగా కడప జిల్లాలో పర్యటించిన జగన్ పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. నాన్న పుట్టిన రోజు రైతు దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని సీఎం అన్నారు.