
తెలంగాణలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో శుక్రవారం రిజిస్ట్రేషన్లు జరగవు. రాష్ట్ర డేటా సెంటర్ లో ఐటీ శాఖ కొత్త యూపీఎస్ లను ఏర్పాటు చేస్తుండటంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్లకు ప్రాతిపదికగా ఉన్న కార్డ్ విధానం, రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్ సేవలు గురువారం రాత్రి 7 గంటలకే నిలిచిపోయాయి. శుక్రవారం రోజంతా రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు సహా ఇతర సేవలు అందుబాటులో ఉండవు, రెండో శనివారం, ఆదివారం వరుసగా రెండు రోజులు సెలవులు కావడంతో తిరిగి సోమవారం రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి.