
తెలంగాణలో మళ్లీ సంక్షేమ పాలన తీసుకొచ్చేందుకే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినట్లు షర్మిల తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు ఇంకా వైఎస్ ఆర్ పాలనను తలచుకుంటున్నారని, పేదరికం రూపుమాపడమే లక్ష్యంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పనిచేస్తుందని షర్మిల పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పూర్తి స్థాయిలో కోట్లాడతాం. సరిగ్గా 100 రోజుల్లో పాదయాత్ర మొదలుపెడతాను, ప్రజలు ఆశీర్వాదం ఇస్తే ఇంటికి మా పాలన అందిస్తాం, నమ్మిన దానికి చిత్త శుద్ధిగా పనిచేస్తానని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.