
టోక్యో ఒలింపిక్స్ లో భారత రెజ్లర్లు దీపక్ పూనియా, రవి దహియా లు సెమీస్ లోకి దూసుకెళ్లారు. 57 కేజీల మెన్స్ ఫ్ట్రీస్టయిల్ క్వార్టర్స్ లో బల్గేరియా కు చెందిన జార్జి వంజెలోవ్ పై 14-4 స్కోర్ తో రవికుమార్ దహియా విజయం సాధించి సెమీస్ లోకి ఎంటర్ అయ్యాడు. ఇవాళ జరిగిన ఫ్రీకార్వర్టర్స్ లో కొలంబియా రెజ్లర్ ఆస్కార్ టిగ్రిరోస్ పై రవి విజయం సాధించాడు. 86 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ లో దీపక్ పూనియా సెమీస్ లోకి ప్రవేశించాడు. క్వార్టర్స్ లో అతను చైనాకు చెందిన రెజ్లర్ సుషెన్ లిన్ పై 6-3 స్కోర్ తో దీపక్ గెలిచాడు. సెమీస్ లో డేవిస్ మోరిస్ తో దీపక్ తలపడనున్నాడు.