
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిస్థాయిలో అదుపులో ఉందని ప్రజారోగ్య సంచాలకులు డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. కొవిడ్ తీవ్రత తగ్గినప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మూడో వేవ్ ముప్పుపై ఇంకా సరైనా ఆధారాలు లేవన్నారు. మరోవైపు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోందని డీహెచ్ తెలిపారు. ఇప్పటి వరకు 1.20 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు చెప్పారు.